ఎంత మంది తీస్మార్‌ఖాన్‌లు వచ్చినా ఏమీ చేయలేరని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు

Advertisements

&NewLine;<p>కేసీఆర్‌ ప్రజాభిమానం ముందు ఎంత మంది తీస్మార్‌ఖాన్‌లు వచ్చినా ఏమీ చేయలేరని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌&comma; మంత్రి కేటీఆర్‌ అన్నారు&period; ఆదివారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో కల్వకుర్తి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్‌యాదవ్‌కు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో&comma; షాద్‌నగర్‌ చౌరస్తాలో అభ్యర్థి అంజయ్యయాదవ్‌తో కలిసి నిర్వహించిన రోడ్‌ షోలో కేటీఆర్‌ మాట్లాడారు&period; ఒక్క చాన్స్‌ ఇవ్వండి అంటున్న కాంగ్రె్‌సకు గతంలో ప్రజలు 11సార్లు ఇస్తే ఏం సాధించారని ప్రశ్నించారు&period; వారి పాలనలో కరెంట్‌ లేక రైతులు&comma; తాగు నీరు దొరకక మహిళలు అష్టకష్టాలు పడ్డారన్నారు&period; రాష్ట్రంలో 24 గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తుంటే&period;&period; కాంగ్రెస్‌ నేతలు ఐదు గంటల కరెంటు చాలు అనడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు&period; ఈ ఎన్నికలు ఢిల్లీ దొరలకు&period;&period; నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరుగుతున్న యుద్ధం అని అన్నారు&period; రాష్ట్రంలో బీజేపీ లేకుండాపోయిందని&comma; ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎన్నికలకు ముందే అస్త్రసన్యాసం చేశారన్నారు&period; యుద్ధం చేసే ధైర్యం లేక బరిలో నిలువకుండా పారిపోయాడని విమర్శించారు&period; తెలంగాణలో గులాబీ జెండా ఉండగా గుజరాత్‌&comma; ఢిల్లీ రాజుల పాలన మనకు అవసరమా అని ప్రశ్నించారు&period; ఈ ఎన్నికల్లోనూ కేసీఆర్‌ ఒంటరి పోరాటమే చేసి&comma; మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.

వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.

ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.