ఏలూరు లో ఫేక్ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు

Advertisements

&NewLine;<p>కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు&period; కాసుల కక్కుర్తితో అడ్డదారులు తొక్కుతున్నారు&period; చదువుకోకపోయినా పర్లేదు&period;&period; డబ్బు ఇస్తే చాలు చేతిలో సర్టిఫికెట్లు చేతిలో పెడుతున్నారు&period; టెన్త్&comma; ఇంటర్&comma; డిగ్రీ&comma; బీటెక్&comma; ఎంటెక్&period;&period; ఇలా ఏదైనా&period;&period; చదువుకోకపోయినా సర్టిఫికెట్ మీ చేతికి అందుతుంది&period; డబ్బు చెల్లిస్తే చాలు పనైపోతుంది&period; తాజాగా వారి పాపం పండింది&period; నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా గుట్టు రట్టైంది&period;<br>ఏలూరులో కలకలం రేగింది&period; నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు&period; నకిలీ ధ్రువపత్రాల తయారీని ఏలూరులోని ప్రైవేట్ కాలేజీ మేనేజ్ మెంట్ గుర్తించింది&period; దూరవిద్యకు సంబంధించి కళాశాలను యాజమాన్యం నడుపుతోంది&period; తమ కాలేజీకే సంబంధించిన నకిలి సర్టిఫికెట్లను మేనేజ్ మెంట్ గుర్తించింది&period; దాంతో కాలేజీ యాజమాన్యం నివ్వెరపోయింది&period; దీన్ని సీరియస్ గా తీసుకుంది&period;<br>వెంటనే అలర్ట్ అయిన కాలేజీ యాజమాన్యం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు&period; వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు చింతలపూడి పోలీసులు&period; విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి&period; చింతలపూడికి చెందిన కొలుకులూరి సోంబాబుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు&period; ముఠా సభ్యులపై నిఘా పెట్టారు&period; నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముగ్గురు సభ్యుల మఠాను అరెస్ట్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.