105
సైబర్ టవర్స్ నిర్మించి 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఐటీ ఉద్యోగులు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో టీడీపీ అధినేత చంద్రబాబుకి కృతజ్ఞత కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి భారీగా ఐటీ ఉద్యోగులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే చంద్రబాబు కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ టీమ్ సంగీత విభావరి నిర్వహించింది. నందమూరి రామకృష్ణ, బాలకృష్ణ భార్య వసుంధరతో పాటు పలువురు నందమూరి కుటుంబసభ్యులు ఇందులో పాల్గొన్నారు.అలాగే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.