సైబర్ టవర్స్ నిర్మించి 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఐటీ ఉద్యోగులు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో టీడీపీ అధినేత చంద్రబాబుకి కృతజ్ఞత కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి భారీగా ఐటీ ఉద్యోగులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే చంద్రబాబు కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ టీమ్ సంగీత విభావరి నిర్వహించింది. నందమూరి రామకృష్ణ, బాలకృష్ణ భార్య వసుంధరతో పాటు పలువురు నందమూరి కుటుంబసభ్యులు ఇందులో పాల్గొన్నారు.అలాగే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
IT Employees
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌పై నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 51 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు రిమాండ్‌లో ఉన్నారు. అయితే చంద్రబాబుకు మద్దతుగా వివిధ వర్గాల వారు రోడ్డెక్కుతున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు వివిధ రూపాల్లో మద్దతు తెలుపుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన మరుసటి రోజు నుంచే ఐటీ ఉద్యోగులు ఆందోళనలు చేశారు. హైదరాబాద్‌లో చంద్రబాబు హయాంలో వచ్చిన ఐటీ కంపెనీలు, బిల్డింగ్స్ వద్ద ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు మద్ధతుగా ఆందోళన నిర్వహించారు. బ్లాక్ డ్రెస్‌లతో ఆఫీసులకు వెళ్లి చంద్రబాబుకు మద్దతు పలికారు. ఇటు మెట్రో రైల్లో కూడా చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా బ్లాక్ డ్రెస్‌లతో ఐటీ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఐటీ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు. తాజాగా ఐటీ ఉద్యోగులు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబుకు కృతజ్ఞతగా భారీ సభను ఏర్పాటు చేశారు. సాయంత్ర 4గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో ఈ సభ జరగనుంది. సభకు సంబంధిచి అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు. దాదాపు లక్ష మందిపైగా ఈ సభకు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఐటీలో తాము చేస్తున్న ఉద్యోగాలు నాడు చంద్రబాబు ఐటీని అభివృద్ధి చేయడం వల్లే వచ్చాయని టెక్కీలు తెలిపారు. దీనికి చంద్రబాబుకు కృతజ్ఞతగా ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రాజకీయంగానే కాకుండా చంద్రబాబు విజన్‌పై కూడా ఏపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఐటీ ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేశారు. గూగుల్‌లో ఆయన చేసిన అభివృద్ధి పనులు కనిపించకుండా కేవలం స్కిల్ డెవలప్మెంట్ కేసు మాత్రమే కనిపించేలా చంద్రబాబు పేరును అబాసుపాలు పేర్కొన్నారు. ఐటీ అభివృద్ధికి నిదర్శనంగా నిలిచే హైదరాబాద్‌లోని సైబర్ టవర్స్ నిర్మించి 25 ఏళ్లు ఘనంగా నిర్వహించేందుకు అక్టోబరు 29న గచ్చిబౌలి మైదానంలో పెద్ద ఎత్తున మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించబోతున్నట్లు ఐటీ ఉద్యోగులు తెలిపారు. ప్రత్యేకంగా రూపొందించిన iamwithcbn.co వెబ్ సైట్ ను జూబ్లీహిల్స్ లో లాంఛనంగా ఆవిష్కరించారు. చంద్రబాబుపై కృతజ్ఞత చూపించే ఐటీ ఉద్యోగులు, వివిధ రంగాల్లో స్థిరపడిన అభిమానులంతా వెబ్సైట్లో తమ పేరు నమోదు చేసుకొని గచ్చిబౌలిలో నిర్వహించండి స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీ కూడా జైల్లో ఉన్నారని, ఏపీ ప్రజల కోసం చంద్రబాబు జైల్లో ఉండటం వల్ల ఆయనకు ఎలాంటి మలినాన్ని అంటుకోదని పేర్కొన్నారు.




Total views : 77494