ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరిఖని సీతానగర్ కూరగాయల మార్కేట్ లో రామగుండం నియోజక వర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంధ్యారాణి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కూరగాయల మార్కెట్లో వ్యాపారస్తులను వినియోగదారులను కలిసి బిజెపికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సంధ్యారాణి కోరారు. అనంతరం బిజెపి అభ్యర్థి సంధ్యారాణి మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యంతో కూరగాయల మార్కెట్ అసాంఘిక కార్యకలాపాలకు నీలయంగా మారిందని విమర్శించారు. వర్షాకాలంలో రైతులు కూరగాయలను నిల్వ చేసుకోవడానికి కనీస సౌకర్యాలను కల్పించడంలో నాయకులు విఫలమయ్యారని విమర్శించారు. రామగుండంలో బిజెపి పార్టీని గెలిపిస్తే…గెలిచిన నెల రోజుల్లో సుందరీకరణ తీర్చిదిద్ది ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు విరామం తీసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు కూరగాయలు నిల్వ చేసుకోవడానికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తామన్నారు. కూరగాయల మార్కెట్ భువన సముదాయం కోసం కోట్ల రూపాయలు వేచించి నాయకులు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. సామాన్య మహిళగా రామగుండం నియోజకవర్గంలో బిజెపి పార్టీకి ఓటు వేసి ఒక అవకాశం ఇవ్వాలని, ప్రత్యేక మెజార్టీతో గెలిపించాలని కందుల సంధ్యారాణి వారిని కోరారు.
కందుల సంధ్యారాణి ఎన్నికల ప్రచారం..
118
previous post