కోరిన వారికి కొంగుబంగారం జొన్నవాడ..

jonnawada temple

Advertisements

&NewLine;<p>లోకహితం కోరిన కశ్యప మహర్షి ఒకసారి పినాకిని ఒడ్డున తల్పగిరి&comma; రజితగిరి&comma; వేదగిరి అనే కొండల వద్ద యాగం మొదలుపెట్టాడు&period; యాగం ముగిసిన తర్వాత మల్లికార్జునస్వామి ప్రత్యక్షమయ్యాడు&period; పరమానందభరితుడై ప్రత్యక్షమైన పరమేశ్వరుని చూసి కాశ్యప మహర్షి &OpenCurlyQuote;స్వామీ&excl; లోకహితం కోసం తొందరపడి ఒంటరిగా వచ్చావే&excl; దేవి కూడా ఇక్కడ ప్రత్యక్షమైతే మహదానందం కలుగుతుంది’ అన్నాడు&period; పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి సమ్మతించగా కామాక్షిదేవి ప్రత్యక్షమైంది&period; కాశ్యప మహర్షి మల్లికార్జునస్వామిని&comma; కామాక్షిదేవిని అక్కడ ప్రతిష్ఠించారు&period; పూజలు సల్పారు&period; ఆ సమయంలో తీర్ధయాత్రలకు బయలుదేరిన దుర్వాసముని రాజగిరికి చేరుకున్నాడు&period; అయితే ఆయన రాకను గమనించలేదు శివుడు&period; అందువల్ల ఆగ్రహించిన దుర్వాసముని శివునితో &OpenCurlyQuote;ఈప్రదేశంలోని ఆలయం పుట్టుపూర్వోత్తరాలే లేకుండా పోతుంది’ అని శపించాడు&period; ప్రళయం వచ్చింది&period; పినాకిని నదిలో ఉప్పెన పొంగింది&period; ఉప్పెనలో ఆలయం మునిగిపోయింది&period; మల్లికార్జునస్వామి&comma; కామాక్షిదేవిల విగ్రహాలు ఉప్పెనలో కొట్టుకుపోయాయి&period; ఇది పూర్వగాథ&period; కలియుగం అవతరించింది&period; పచ్చనిపైర్లతో ఎంతో సమృద్ధిగా ఉన్న జొన్నవాడ ప్రదేశంలో పశువుల కాపర్లు తమ పశువులను మేపుతున్నారు&period; వారిలో ఒక బాలుడు భూమిలో ఏదో ప్రకాశం ఉన్నట్టు చూసాడు&period; అక్కడ భూమిని తవ్వగా ఒక శివలింగం కనిపించింది&period; ప్రజలు దాన్ని చూసి ఆ లింగం ఉప్పెనలో కొట్టుకుపోయిన లింగం అని తెలుసుకున్నారు&period; లింగాన్ని అక్కడ ప్రతిష్ఠించారు&period; ఆయనతో పాటు ఉండాల్సిన కామాక్షిదేవి ఏమయింది&quest; నని చింతించసాగారు&period; మరికొద్ది రోజుల్లోనే ఆ ప్రశ్నకు సమాధానం లభించింది&period; పినాకిని నదిలో చేపలు పట్టడానికి విసిరిన వలలో అమ్మవారి విగ్రహం దొరికింది&period; సంతసించిన ప్రజలు మల్లికార్జునస్వామి పక్కనే అమ్మవారిని ప్రతిష్టించారు&period; వారు తినే మాంసం&comma; చేపలనే నైవేద్యంగా సమర్పించసాగారు&period; కాని ఆ అమ్మవారు రాత్రిపూట బిగ్గరగా నవ్వడమూ&comma; ఉగ్రరూపంలో సన్నిధి వదిలి ఊరిలోపలికి ప్రవేశించి ఆవులను&comma; కొంగలను&comma; కోళ్లను చంపి స్వాహా చేయసాగింది&period; ప్రపంచాన్ని కాపాడాల్సిన తల్లి అలా జీవరాశులను నాశనం చేయడం చూసి ప్రజలు కలవరపడ్డారు&period; ఆ సమయంలో అక్కడికి ఆదిశంకరుడు వచ్చారు&period; మల్లికార్జునస్వామిని&comma; కామాక్షిదేవిని దర్శించుకుని పూజించాడు&period; ఆరోజు రాత్రి ఆ ఆలయంలోనే ఉండి ఉదయానే్న బయలుదేరాలని ఆయన నిర్ణయించుకున్నాడు&period; ఆ దేవి ఆదిశంకరుణ్ణి కూడా హింసిస్తుందేమోనన్న అనుమానంతో ప్రజలు భయపడ్డారు&period; అమ్మవారి గురించి&comma; ఆమె మాంసాహార్రపీతి గురించి వారు ఆదిశంకరునికి తెలిపారు&period; ఆమె వెళ్లే మార్గంలో ఆదిశంకరుడు శయనిస్తే ఆయన ప్రాణాలకు హాని జరుగుతుందని ప్రజలు వారించారు&period; ఆయను జాగ్రత్తగా ఉండమనిచెప్పారు&period; ఆదిశంకరుడు &OpenCurlyQuote;మీ పశువులను ఆ కామాక్షిదేవి భుజించకుండా ఉండేలా చేస్తాను’ అని మాటిచ్చాడు&period; అర్ధరాత్రి దేవి బిగ్గరగా నవ్వుతూ ఆలయంనుండి బయటికి వెళ్లింది&period; దారిలో శయనించిన ఆదిశంకరుణ్ని తప్పుకోమని హెచ్చరించింది&period; ఆదిశంకరుడు ఆ దేవినిప్రసన్నం చేసుకోవాలని స్తుతించారు&period; ఆయన కీర్తించే ఒక్కో శ్లోకానికి అమ్మవారి రౌద్రం తగ్గసాగింది&period; ఆమె మొహం ఎంతో ప్రశాంతంగా మారిపోయింది&period; ఆదిశంకరుడు ఆమె ఎదుట ఒక శ్రీ చక్రాన్ని స్థాపించాడు&period; ఆ తర్వాత దేవిని చూసి &OpenCurlyQuote;&OpenCurlyQuote;తల్లీ&excl; భక్తులు ఇకపై భయపడకుండా నిన్ను పూజించాలంటే నువ్వు ఇకపై వికటాట్టహాసం చేయకూడదు&period; మాట్లాడకూడదు&period; ఆలయంనుండి బయటికి వెళ్లకూడదు’’ అని ఆంక్ష విధించాడు&period; దేవి &OpenCurlyQuote;&OpenCurlyQuote;నన్ను నమ్మి వచ్చే భక్తులకు వరములివ్వడం&comma; ఆశీర్వదించడం ఎలా’’అని ప్రశ్నించింది&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;భక్తుల కలలో దర్శనమిచ్చి ఆశీర్వదించు&period; వారు వేడుకుంటే నెరవేరుస్తానని తెలిసేలా చేసి&comma; వారు సంతోషంగా జీవించడానికి సాయపడు’’అన్నాడు ఆదిశంకరుడు&period; కామాక్షిదేవి ఆయన ఆంక్షలకు కట్టుబడింది&period; తన సన్నిధిలో తమ సమస్యలను చెప్పుకుని మొరపెట్టుకునే భక్తులు ఆ ఆలయంలో నిద్రిస్తే వారి సమస్యలు తీరిపోతాయని వరమిచ్చింది&period; నెల్లూరునుండి 15 కిలోమీటర్ల దూరంలో వున్న జొన్నవాడలో శాంతస్వరూపిణిగా కామాక్షిదేవి కొలువై ఉంది&period; అమ్మవారి ఆలయ గోపురం లోపలికి ప్రవేశించగానే ముందు ఎడమవైపున వున్న మార్గంలో వెడితే పినాకిని నదికి చేరుకోవచ్చు&period; ఆలయ ప్రవేశ ద్వారంలో దేవి కామాక్షి సన్నిధి వైపు వెళ్లే మార్గంలో రెండు వైపులా శూలాన్ని చేతబూనిన మహిళా ద్వారపాలకులు గోచరిస్తారు&period; లోపలికి వెడితే విశాలమైన లోగిలి&period; దాన్ని దాటి వెడితే ముందుగా కల్యాణ మండపం వస్తాయి&period; కల్యాణ మండపానికి కుడివైపు కామాక్షిదేవి గర్భగుడికి వెళ్లే దారిలో బలిపీఠం&comma; ధ్వజస్థంభం ఉంటాయి&period; ధ్వజస్తంభం ముందు ఒక పెద్ద నంది&comma; దానిపక్కనే చిన్న నంది ఉంటాయి&period; లోపలికి వెళ్లగానే అర్ధమండపంలో చాలా స్తంభాలుంటాయి&period; ఆలయ పురాణం శిల్పాల రూపంలో తెలిసేలా అమర్చారు&period; అర్ధమండపం తర్వాత వరసగా గర్భగుడులు ఉంటాయి&period; మొదటి గర్భగుడిలో లక్ష్మీగణపతి&comma; ఎడమవైపున చిన్న మహలక్ష్మి విగ్రహం ఉంటాయి&period; గర్భగుడిలో మల్లికార్జునస్వామి కొలువై ఉన్నారు&period; చిన్న లింగం&comma; వల్లి&comma; దేవయాని సమేత సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉన్నారు&period; అఖిల జగత్తును కాపాడే కామాక్షిదేవి ఈ క్షేత్రంలో నిల్చున్నట్టు మనకు దర్శనమిస్తుంది&period; చిరునవ్వుతో ఉన్న ముఖారవిందం&comma; కరుణ భరితమైన నయనాలతో సర్వాలంకారాలతో దర్శనిమిస్తుంది&period; నాలుగు హస్తాలతో ఉన్న అఖిలాండేశ్వరి పై రెండు చేతులలో అంకుశము&comma; పాశము ఉంటాయి&period; కింది రెండు చేతులలో ఒకటి అభయ హస్తంగాను&comma; మరొకటి శరణాగతి పొందమని చూపినట్టు ఉంటాయి&period; ఆ తల్లిని చూడడానికి రెండు కళ్లు చాలవు&period; ఆ దేవి ఎదుట శ్రీ చక్రం స్థాపించిన ఆది శంకరుడు చేత ఒక దండంతో దర్శనమిస్తాడు&period; బయటి ప్రాకారంలో గణపతి&comma; వల్లి&comma; దేవయాని సమేతుడైన సుబ్రహ్మణ్యస్వామి&comma; పసుపు రాసిన ముఖారవిందంతో దుర్గాదేవి చిన్న మండపాలలో దర్శనమిస్తారు&period; దుర్గాదేవి పక్కనే నవగ్రహాలున్నాయి&period; బయటి ప్రాకారంలో భక్తులు వేచి ఉంటారు&period; ఈ క్షేత్ర దర్శనానంతరం బయటికి వచ్చేటప్పుడు మానసికంగా ఎంతో ప్రశాంతత లభిస్తుంది&period; ఇక్కడ ప్రతి ఏటా ఏప్రిల్&comma; మే మాసాలలో పదిరోజులపాటు ఉత్సవాలు నిర్వహించబడతాయి&period; ప్రతి శుక్రవారం అమ్మవారి సన్నిధికి పెద్దఎత్తున ముత్తయిదువలు చేరుకుని పూజలు చేస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..