రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట

Advertisements

<p>ప్రముఖ వ్యాపారవేత్త&comma; కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు భారీ ఊరట లభించింది&period; హర్యానాలోని గురుగ్రామ్ భూ కుంభకోణం&comma; మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఆయనకు ఉపశమనం కలిగింది&period; ఇవాళ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన ఆయనకు ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది&period;<&sol;p>&NewLine;<p>హర్యానాలోని శిఖోపూర్ గ్రామంలో 2008లో జరిగిన 3&period;53 ఎకరాల భూ లావాదేవీల చుట్టూ ఈ వివాదం నడుస్తోంది&period; రాబర్ట్ వాద్రాకు చెందిన &&num;8216&semi;స్కై లైట్ హాస్పిటాలిటీ&&num;8217&semi; సంస్థ&period;&period;ఒంకార్వేగర్ ప్రాపర్టీస్ నుంచి ఈ భూమిని కొనుగోలు చేసింది&period; ఈ డీల్ సమయంలో తప్పుడు పత్రాలు సమర్పించారని&comma; ఎలాంటి నగదు చెల్లించకుండా లావాదేవీలు జరిపారని ఈడీ ఆరోపించింది&period; అప్పటి రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి ఈ భూమికి కమర్షియల్ లైసెన్స్ సంపాదించి&comma; ఆ తర్వాత దానిని DLF సంస్థకు భారీ లాభానికి విక్రయించారని ఈడీ పేర్కొంది&period; ఈ మొత్తం వ్యవహారం ద్వారా PMLA చట్టం ప్రకారం 58 కోట్ల మేర అక్రమ సొమ్ము ఆర్జించారని ఈడీ చార్జ్‌షీట్‌లో స్పష్టం చేసింది&period;<&sol;p>&NewLine;<p>ఈ కేసు చార్జ్‌షీట్‌ను పరిశీలించిన ప్రత్యేక కోర్టు రాబర్ట్ వాద్రాకు సమన్లు జారీ చేస్తూ మే 16à°¨ హాజరు కావాలని ఆదేశించింది&period; కోర్టు ఆదేశాల ప్రకారం ఇవాళ హాజరైన వాద్రాకు 50వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తు&comma; అంతే మొత్తానికి సమానమైన ఒక షూరిటీ సమర్పించాలనే షరతుపై కోర్టు బెయిల్ మంజూరు చేసింది&period; దీనిపై స్పందించిన రాబర్ట్‌ వాద్రా దేశ న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు&period; అయితే దర్యాప్తు సంస్థ అయిన ఈడీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా నడుచుకుంటోందని ఆరోపించారు&period; తన వద్ద దాచడానికి ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!