నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ

Advertisements

<p>నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో పెట్రోల్&comma; డీజల్ నిక్షేపాల అన్వేషణ కలకలం రేపుతోంది&period; మండలంలోని పలు గ్రామాల్లో చమురు నిల్వలను గుర్తించేందుకు భారీ స్థాయిలో బోరు తవ్వకాలు ప్రారంభమయ్యాయి&period; శాటిలైట్ ద్వారా గుర్తించిన పాయింట్ల ఆధారంగా సుమారు 50 బోరు బావుల తవ్వకాలకు ట్రయల్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది&period; రుద్రవరం మండల కేంద్రంలోని విజయ పాల డైరీ సమీపంతో పాటు ఎరుషలేము ప్రార్థనా మందిరం వద్ద కూడా బోరు బండ్లు తవ్వకాలు చేపడుతుండటంతో స్థానికుల్లో ఆసక్తి&comma; ఆందోళన రెండూ వ్యక్తమవుతున్నాయి&period;<br &sol;>&NewLine;కేంద్ర ప్రభుత్వ అనుమతులతో హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్లు ఈ పనులను చేపట్టారని చెబుతున్నారు&period; ఓఎన్‌జీసీ అనుమతులతో వివిధ గ్రామాల్లో శాటిలైట్ సూచించిన ప్రదేశాల్లో బోరు తవ్వకాలు కొనసాగుతున్నాయని తెలిపారు&period; చమురు నిక్షేపాల అన్వేషణలో భాగంగా 80 అడుగుల నుంచి 200 అడుగుల లోతు వరకు తవ్వుతున్నట్లు వెల్లడించారు&period; సరైన సమాచారం ఇవ్వకుండా&&num;8230&semi; అనుమతులు తీసుకోకుండా పంట పొలాల్లో తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు&period; ముఖ్యంగా రాత్రి వేళల్లో రహస్యంగా బోరు పనులు కొనసాగించడం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..