72
ఏపీలో ఐదేళ్ల పాటు ఓ వెలుగు వెలిగిన వైసీపీ నేతలు కనుమరుగైపోయారు. ఉన్న పదకొండు మంది ప్రజా ప్రతినిధుల ముఖంలో కళ తప్పింది. ఇన్నాళ్లూ కన్నూమిన్నూ కానకుండా.. ప్రవర్తించిన నాయకులంతా అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోయారు. ఇక, ఊహించని ఘోర ఓటమిని జీర్ణించుకోలేక జగన్ అసహనానికి గురవుతున్నారు. ఈవీఎంలపై నెపం నెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఆ పార్టీ నాయకుడు రాపాక వరప్రసాద్ మాత్రం ట్యాంపరింగ్ అబద్ధమంటూ జగన్ వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు. జనం ఓటేయకపోతే ఈవీఎంలు ఏం చేస్తాయని రాపాక ప్రశ్నించారుమరోవైపు.. వైఎస్ జగన్‌ను నమ్మి నిండా మునిగామని ఆపార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. కొద్దిరోజుల్లో వైసీపీ ఖాళీ అవుతుందని సొంతపార్టీ సీనియర్ నేతలే చెబుతున్నారు. ఇక, అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం సమయంలో వైఎస్ జగన్ తడబడ్డారు. తన పేరునే పూర్తిగా చదవలేకపోయారు. ఇక, అసెంబ్లీలో తీవ్ర విచారవదనంలో వైఎస్ జగన్ కనిపించారుఅటు.. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారని చెబుతున్నారు. తన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా బీజేపీలోకి రమ్మని మిథున్‌రెడ్డి ఒత్తిడి తెస్తున్నారట. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేల్చిన ఈ బాంబు వైసీపీ బాక్సు బద్దలు చేస్తోంది. జగన్‌కు బైబై చెప్పే ఆలోచనలో వైసీపీ ప్రజా ప్రతినిధులు ఉన్నారన్న వాదనకు బలం చేకూర్చింది. కొంతకాలానికి వైసీపీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు మిగిలే పరిస్థితి లేదని ఆ పార్టీ నేతలే అంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే వైసీపీ ఖాళీ అవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
- ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాధపాలెం బీసీ గురుకుల పాఠశాలలో ఈఘటన జరిగింది. కీర్తి అనే విద్యార్థిని పలు మార్లు ఎలుక…
- విష్ణు గొడవ చేయలేదు … మనోజ్ కావాలనే ఇదంతా చేస్తున్నాడుమంచు మనోజ్ ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదన్నారు తల్లి మంచు నిర్మల. మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ వివాదంపై ఆయన భార్య నిర్మల తొలిసారి స్పందించారు. మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తోన్న వార్తలపై ఆమె స్పష్టతనిచ్చారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.