ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో వరుసగా ఫీచర్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తోంది. తక్కువ ధరతో ఆకర్షణీయమైన ఫీచర్లతో ఇవి వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ కంపెనీ జియో ఫోన్ ప్రైమా 4జీ పేరుతో మరో ఫోన్ ను విడుదల చేసింది. దీపావళికి అందుబాటులోకి రానుంది. జియో ఫోన్ ప్రైమా 4జీ ఫోన్ 2.4 అంగుళాల టీఎఫ్ టీ డిస్ ప్లేతో పనిచేస్తుంది. ఫ్లాష్ లైట్, కెమెరా సదుపాయం ఉండటంతోపాటు 512 ఎంబీ ర్యామ్ ఉంది. మెమొరీ కార్డుద్వారా దీన్ని 128 జీబీకి పెంచుకోవచ్చు. kaiOSపై ఇది పనిచేస్తుంది. ఆర్మ్ కోర్టెక్స్ ఏ 53 ప్రాసెసర్ తో వస్తోంది. బ్లూటూత్ 5.0, 1800 ఎంఏహెచ్ బ్యాటరీతోపాటు ఎఫ్ ఎం రేడియో సౌకర్యం ఉంది. జియో టీవీ, యూట్యూబ్, జియో సినిమా, సియో న్యూస్, జియో సావన్ వంటి యాప్స్ ఉచితంగా ఇన్ స్టాల్ చేసి వస్తున్నాయి. ఫేస్ బుక్, వాట్సాప్ వంటి యాప్స్ ను కూడా ఉపయోగించుకోవచ్చు. జియో పే ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయడంతోపాటు మొత్తం 23 భాషలకు సపోర్ట్ చేస్తుంది. దీపావళి సమయానికి ఈ ఫోన్ కు సంబంధించిన అన్ని వివరాలు తెలుస్తాయి. జియో భారత్ పేరుతో ఇటీవలే కొన్ని ఫోన్లను జియో తీసుకొచ్చింది. వీటి ధరలు రూ.999 నుంచి ప్రారంభమవుతున్నాయి. తాజాగా యూపీఐ సదుపాయంతో జియో భారత్ బీ1 4జీ విడుదల చేసింది. దీని ధరను రూ.1299గా నిర్ణయించారు. అమెజాన్, జియో ఔట్ లెట్స్ లో ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.
జియో నుంచి కొత్త ఫోన్ అదిరిపోయింది
103
previous post