టికెట్లు అమ్ముకునే సంస్కృతి ఉన్న కాంగ్రెస్‌పార్టీ రేపు రాష్ట్రాన్ని అమ్ముకోదన్న గ్యారంటీ ఏంటని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆందోల్ మండల పరిధిలోని సంగుపేట వద్ద జరిగిన బూత్ కమిటీల సమావేశానికి హాజరై ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌తో కలిసి మాట్లాడారు. కాంగ్రెసోళ్లకు ప్రజలు పదకొండు సార్లు అవకాశమిస్తే ఏం డెవలప్ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సంగారెడ్డిని జిల్లా చేయలేదు, తలాపున ఉన్న సింగూర్ నుంచి వ్యవసాయానికి నీళ్లు ఇవ్వలేని అసమర్థులన్నారు. ఆందోల్ కాంగ్రెస్ పెద్ద లీడర్ వాళ్లకు, వీళ్లకు టికెట్ ఇప్పిస్తానని మాటిచ్చి ఇప్పుడు భంగపడ్డారని విమర్శించారు. తెలంగాణ సాధించి అభివృద్ధి వైపు నడిపిస్తున్న కేసీఆర్‌ను వదులుకుంటే తెలంగాణ ప్రజలు ఆగమవుతారన్నారు. కేసీఆర్‌ను గెలిపించుకుటేనే భవిష్యత్ ఉంటుందన్నారు. తల్లి లాంటి బీఆర్ఎస్ను ప్రజల నుంచి దూరం చేయడానికి కాంగ్రెస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయన్నారు. కార్యకర్తలు ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
టికెట్లు అమ్ముకున్నోళ్లు.. రాష్ట్రాన్ని అమ్ముకోరా..!
93
previous post