తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు..

Advertisements

<p>రుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు&period; కొండపై భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో సర్వదర్శనానికి ఏకంగా 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది&period; వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయి&comma; క్యూలైన్లు బయట శిలాతోరణం వరకు విస్తరించాయి&period; టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం&comma; శుక్రవారం ఒక్కరోజే 68 వేల 156 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు&period; వీరిలో 28 వేల 295 మంది తలనీలాలు సమర్పించుకున్నారు&period; భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం 3&period;46 కోట్లుగా నమోదైంది&period; దర్శన సమయం 10-12 గంటల నుంచి ఒక్కసారిగా 20 గంటలకు చేరడం రద్దీ తీవ్రతకు అద్దం పడుతోంది&period; మరోవైపు&comma; రానున్న వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించారు&period; భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి&comma; దర్శన సమయాన్ని తగ్గించే లక్ష్యంతో టీటీడీ అదనపు ఈవో ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు&period; డేటా ఆధారిత వ్యూహంతో రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు అధికారులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట రామాలయంలో అఖండ దీపం.

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..