దేశంలో జనాభా సంఖ్య ఆధారంగా ఎంపీ సీట్లను 50 శాతం పెంచుతుండటం వెనుక కుట్ర దాగి ఉందని…

Advertisements

<p>దేశంలో జనాభా సంఖ్య ఆధారంగా ఎంపీ సీట్లను 50 శాతం పెంచుతుండటం వెనుక కుట్ర దాగి ఉందని&comma; అదే జరిగితే దక్షిణ భారతంతో సంబంధం లేకుండా ఉత్తర భారతంలోని నాలుగు రాష్ట్రాల సీట్లతో కేంద్రంలో అధికారంలోకి రావొచ్చని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు&period; ఆయన నియోజకవర్గాల పునర్విభజన&comma; 50 శాతం ఎంపీ సీట్ల పెంపు తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు&period; ఇప్పుడు ఎంపీ స్థానాల విషయంలో ఉత్తరాది&comma; దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరం ఉందన్నారు&period; అంతే స్థాయిలో సీట్ల పెంపు జరగాలని&comma; దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని ఆరోపించారు&period; దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్‌పై పోరాటానికి సిద్ధం కావాలన్నారు&period; 50 శాతం సీట్ల పెంపు ఏ లెక్క ప్రకారం జరుగుతుంది&quest; అలా సీట్ల పెంపు అనేది దక్షిణాది రాష్ట్రాలపై ఫైనల్‌ బుల్లెట్‌ అని సీఎం అన్నారు&period; ఈ పద్ధతిలో తమిళనాడు&comma; పుదుచ్చేరిలో ఇప్పుడున్న 40 సీట్లు 60 అవుతాయని&comma; అదే యూపీలో 80 సీట్లు 120 అవుతాయన్నారు&period; అలా మధ్యప్రదేశ్&comma; యూపీ&comma; రాజస్థాన్&comma; బిహార్‌&&num;8230&semi; ఈ నాలుగు రాష్ట్రాల సీట్లతో కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందఇ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు&period; ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగే సీట్ల వల్ల దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని&comma; కేంద్ర ప్రభుత్వంలో&comma; జాతీయ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల నేతలకు చోటు లేకుండా పోతుందని అన్నారు&period; ఉత్తర&comma; దక్షిణ భారతానికి మధ్య అంతరాన్ని ఎన్‌డీయే ప్రభుత్వం పెంచుతోందన్న ఆయన&comma; అన్ని రాజకీయ పక్షాలతో చర్చించి సీట్ల పెంపుపై ముందుకు వెళ్లాలన్నారు&period; దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానని సీఎం తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.