నేడు కోనాయిపల్లికి సీఎం కేసీఆర్‌

KCR

Advertisements

&NewLine;<p>బీఆర్‌ఎస్‌ అధినేత&comma; సీఎం కేసీఆర్‌ శనివారం కోనాయిపల్లి రానున్నారు&period; తాను సెంటిమెంట్‌గా భావించే వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి&comma; నామినేషన్ల పత్రాలపై సంతకాలు చేయనున్నారు&period; 1983లో టీడీపీ తరఫున తొలిసారి సిద్దిపేట ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన కేసీఆర్‌&period;&period; ఓటమి పాలయ్యారు&period; 1985లో వచ్చిన మధ్యంతర ఎన్నికల సందర్భంగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి&period;&period; నామినేషన్‌ దాఖలు చేశారు&period; ఆ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించడంతో కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేసి&comma; నామినేషన్లు దాఖలు చేయడం కేసీఆర్‌కు సెంటిమెంట్‌గా మారింది&period; అప్పటి నుంచి ప్రతి ఎన్నికల సమయంలోనూ కేసీఆర్‌ ఇదే ఆలయానికి వచ్చి పూజలు చేసిన అనంతరం నామినేషన్‌ వేస్తున్నారు&period;ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌&comma; కామారెడ్డి నియోజకవర్గాల నుంచి బరిలో దిగుతున్న కేసీఆర్‌ ఈసారి కూడా వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత రెండు వేర్వేరు నామినేషన్‌ సెట్లపై సంతకాలు చేయనున్నారు&period; ఈనెల 9à°¨ ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేయనున్నారు&period; కాగా&comma; మంత్రి హరీశ్‌రావు సైతం కేసీఆర్‌తోపాటు ఇదే ఆలయంలో నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేసే ఆనవాయితీని 2004 నుంచి కొనసాగిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.