పంచారామాలు..

Pancharama..

Advertisements

&NewLine;<p>ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ శైవక్షేత్రాలను పంచారామాలు అని పిలుస్తారు&period; పంచారామాలు ఏర్పడుటకు స్కంద పురాణంలో వాటి స్ధల పురాణం ఇలా వివరించబడినది&period;పూర్వం తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి శివుని ఆత్మలింగము సంపాదిస్తాడు&period;దీనితో వర గర్వముతో దేవతలను అనేక రకాలుగా హింసలు గురిచేయగా దీనితో దేవతలు విష్ణుమూర్తిని ప్రార్ధించగా శివపార్వతుల వల్ల కలిగిన కుమారుడు వల్లనే తారకాసురునిపై యుద్ధానికి పంపుతారు&period;యుద్ధమునందు కుమారస్వామి తారకాసురుని కంఠంలో గల ఆత్మలింగమును చేదిస్తేనే మరణము కలుగునని గ్రహించి ఆ లింగమును చేదిస్తాడు&period;దీనితో తారకాసురుడు మరణిస్తాడు&period;చేదించగా ఆ ఆత్మలింగము వేరై ఐదు ప్రదేశములలో పడుతుంది&period; తరువాత వాటిని ఆఅ ప్రదేశాలలో దేవతలు ప్రతిష్ఠ ఛేస్తారు&period; ఇవే పంచారామాలు&period; దాక్షారామము పంచరామాల్లో మొదటిదైన దాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది&period; ఇక్కడ స్వామిని భీమేశ్వరుడు అని పిలుస్తారు&period;స్వామి లింగాకారం 60 అడుగులు ఎత్తులో ఉంటుంది&period; పైఅంతస్తు నుండి పూజలు నిర్వహించాలి&period;ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగం భాగం తెలుపు సగభాగం నలుపుతో ఉంటుంది&period; ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు&period; కనుక ఈ ప్రాంతానికి దాక్షారామము అని పేరు వచ్చిందంటారు&period; ఈ ఆలయం చాళుక్యరాజయిన భీముడు నిర్మించాడని తెలుస్తుంది&period;అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది&period; పూర్వకాలంలో ఎంతోమంది దేవతలు&comma;రాజులు స్వామి వారిని దర్శించి తరించారని తన భీమేశ్వర పురాణంలో రాసాడు&period;ఈ ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది&period;ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం కన్నుల పండుగగా నిర్వహిస్తారు&period; అమరారామము పంచారామల్లో రెండవదైన అమరారామము గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణా తీరమునందు కలదు&period;ఇక్కడ స్వామిని అమరేశ్వరుడు అని పిలుస్తారు&period;గర్భగుడిలో స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తులో తెల్లగా మెరుస్తూ ఉంటుంది&period;ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించబడింది&period; గర్భగుడిలోని విగ్రహాన్ని తారకాసురుని సమ్హారం అనంతరం కంఠంలోని శివుని ఆత్మలింగం చెల్లాచెదురు అవ్వగా దానిలోని ఒభాగాన్ని అమరేశ్వరుడైన ఇంద్రుడు ఇక్కడ ప్రతిష్టించి తన నగరమైన అమరావతినే దీనికి పెట్టాడంటారు&period; క్షీరారామము పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో కలదు&period; ఇక్కడ శివుని మూర్తిని శ్రీ క్షీరారామ లింగేశ్వర స్వామి అని పిలుస్తారు&period; ఇక్కడ స్వామి వారిని త్రేతాయుగ కాలంలో సీతారాములు ఇద్దరూ ప్రతిష్ఠించారట&period;ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఒక కధ ఉంది&period; శివుడు తన బాణమును భూమిలోనికి వెయ్యగానే భూమినుండి పాలదార ఒకటి వచ్చిందట క్షీరం అనగా పాలు దీనిమూలంగా క్షీరపురి అనే పేరు వచ్చింది&period;క్రమంగా క్షీరపురి కాస్తా పాలకొల్లుగా మార్పు చెందింది&period; స్వామి వారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు&period;ఆలయం 125 అడుగుల ఎత్తులో 9 గోపురాలుతో కట్టబడింది&period; సోమారామము పంచరామాల్లో నాల్గవదైన సోమారామము పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమిటర్లు దూరంలో గల గునిపూడిలో కలదు&period; ఇక్కడ స్వామి వారిని సోమేశ్వరుడు అని పిలుస్తారు&period;ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది&period;మాములు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోనికి మారుతుంది&period; తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యధాస్ధానానికి చేరుతుంది&period; ఇక్కడ స్వామిని చంద్రుడు ప్రతిష్టించాడు&period;చంద్రునిచే ప్రతిష్ఠించ బడినది కావున దీనికి సోమారామము అని పేరు వచ్చింది&period; కుమార భీమారామము పంచారామాల్లో చివరిదైన కుమారభీమారామము తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమిటరు దూరంలో కలదు&period;ఇక్కడ స్వామిని కాల బైరవుడు అని పిలుస్తారు&period; ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించిన చాళుక్య రాజయిన భీముచే ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు&period; ఇక్కడి శివలింగం సున్నపురాయితో చెయ్యబడింది&period;ఈ ఆలయంలో మహశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నేటి నుంచి నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు..

కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌లో పూరం ఉత్సవాలు..

తిరుమలలో వైభవంగా పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం