పార్టీ మారలేదన్న ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

పార్టీ మారలేదన్న ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Advertisements

<p>పార్టీ మారలేదన్న ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది&period; అలాగే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు సైతం కోర్టు నోటీసులు ఇచ్చింది&period; బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని ఇటీవల అసెంబ్లీ స్పీకర్ తీర్పు ఇచ్చారు&period; ఈ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు&period; ఈ అంశంపై ఈ రోజు విచారణ జరిగింది&period; దాంతో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఎమ్మెల్యేలతోపాటు స్పీకర్‌‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది&period; నోటీసులు జారీ చేసిన జాబితాలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్&comma; అరికేపూడి గాంధీ&comma; కాలే యాదయ్య&comma; ప్రకాష్ గౌడ్&comma; పోచారం శ్రీనివాసరెడ్డి&comma; బండ్ల కృష్ణమోహన్ రెడ్డి&comma; తెల్లం వెంకట్ రావు ఉన్నారు&period; ఏప్రిల్ 16à°µ తేదీ ఈ కేసు విచారణను వాయిదా వేసింది&period;<&sol;p>&NewLine;<p>బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పిటిషనర్లు స్పష్టం చేశారు&period; వారంతా బహిరంగంగానే కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్ల తరఫు న్యాయవాది&period; అన్ని మీడియాల్లోనూ వీరు కండువా కప్పుకున్న దృశ్యాలు వచ్చాయని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు&period; సుప్రీంకోర్టు&comma; హైకోర్టు చెబితేనే స్పీకర్ స్పందిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వివరించారు&period; పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరితే&period;&period; ఏడాది పాటు ఎలాంటి చర్య తీసుకోలేదని తెలిపారు&period; సుప్రీంకోర్టు చెప్పిన తర్వాతే స్పీకర్ స్పందించారని కోర్టుకు వివరించిన పిటిషనర్ న్యాయవాది&period; ఈ నేపథ్యంలో పర్సనల్ నోటీస్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును పిటిషనర్ న్యాయవాది కోరారు&period; దాంతో వారికి స్పీడ్ పోస్ట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..