129
ఎన్నికల వేళ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలే టార్గెట్గా దర్యాప్తు సంస్థల రెయిడ్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ నేత పొంగులేటిపై ఐటీ దాడులు రాజకీయంగా సంచలనం అవుతున్నది. ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఐటీ దాడులను కాంగ్రెస్ సీనియర్ నేత భట్టివిక్రమార్క ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్దతి కాదన్నారు. నామినేషన్ వేళ ఐటీ దాడులతో భయపెట్టాలని చూడటం సరికాదన్న ఆయన బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర పన్నుతున్నాయని ధ్వజమెత్తారు. పొంగులేటికి పార్టీ అండగా ఉంటుందన్నారు. ఇదిలా ఉంటే గురువారం తెల్లవారుజాము నుంచే ఖమ్మం, హైదరాబాద్లోని పొంగులేటి ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.