బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

bayofbengal

Advertisements

&NewLine;<p>బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనువైన పరిస్థితులు నెలకొన్నాయని ఐఎండీ అమరావతి కేంద్రం వెల్లడించింది&period; నిన్నటి వరకు దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఇవాళ మధ్య ట్రోపోస్ఫియరిక్ స్థాయి వరకు విస్తరించిందని తెలిపింది&period; ఈ ఆవర్తనం నైరుతి దిశగా వంగి ఉండడం వల్ల&comma; దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది&period; ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం దిశగా పయనిస్తుందని&comma; ఈ నెల 16 నాటికి వాయుగుండగా మారే అవకాశం ఉందని ఐఎండీ అమరావతి కేంద్రం వివరించింది&period; అల్పపీడనం ప్రభావం రాయలసీమ&comma; దక్షిణ కోస్తా జిల్లాలపై అధికంగా ఉంటుందని&comma; ఈ నెల 14&comma; 15 తేదీల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది&period; మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..