మహిళా జర్నలిస్టుపై చేయి వేసిన నటుడు సురేశ్ గోపీ..

Suresh gopi

Advertisements

&NewLine;<p>మలయాళ నటుడు&comma; మాజీ ఎంపీ సురేశ్ గోపీ ఓ మహిళా జర్నలిస్టుతో వ్యవహరించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది&period; సురేశ్ గోపీపై గతంలో పెద్దగా వివాదాలేమీ లేకపోగా&comma; ఆయన తాజా ప్రవర్తన విస్మయం కలిగిస్తోంది&period; ఉత్తర కోజికోడ్ లో జరిగిన ఓ కార్యక్రమం సురేశ్ గోపీని మీడియా పలకరించింది&period; సురేశ్ గోపీ తనకు సమీపంలో నిల్చుని మైక్ పట్టుకుని ఉన్న మహిళా జర్నలిస్టు భుజంపై చేయి వేసి మాట్లాడే ప్రయత్నం చేశారు&period; దాంతో ఆమె నవ్వుతూనే ఆయన చేయిని తొలగించారు&period; తర్వాత కాసేపటికి సురేశ్ గోపీ మరోసారి ఆమె భుజంపై చేయి వేశారు&period; ఆమె మళ్లీ ఆ చేతిని తీసివేశారు&period; దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది&period; సురేశ్ గోపీ తీరుతో ఆ పాత్రికేయురాలు ఇబ్బందిపడినట్టు వీడియో చూస్తే తెలుస్తుంది&period; దాంతో&comma; సీనియర్ నటుడి ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి&period; ఈ నేపథ్యంలో&comma; సురేశ్ గోపీ క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు&period; ఆమెను తన కుమార్తెగా భావించి చనువుగా ప్రవర్తించానని వివరణ ఇచ్చారు&period; వాత్సల్యంతోనే భుజంపై చేయివేశానే తప్ప మరో ఉద్దేశం లేదని స్పష్టం చేశారు&period; ఏదేమైనా&comma; ఆమె ఇబ్బంది పడి ఉంటే క్షమాపణ చెబుతున్నానని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..