మున్సిపల్‌ ఎన్నికల తర్వాత ఆసక్తికర పరిణామాలు

Advertisements

<p>మున్సిపల్‌ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు తామిచ్చిన డబ్బును తిరిగివ్వాలంటూ ఓటర్లను డిమాండ్‌ చేస్తున్నారు&period; తాజాగా మేడ్చల్‌లో డబ్బులు తిరిగివ్వమని అడిగిన అభ్యర్థి భర్తపై తిరగబడ్డారు ఓటర్లు&period; ఎల్లంపేట్‌ మున్సిపాలిటీ పరిధిలోని బండమాచారం19à°µ వార్డులో పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థి ఓటమి పాలయ్యారు&period; దీంతో తమకు ఓటేయలేదంటూ ఇచ్చిన డబ్బు తిరిగివ్వాలని ఆమె భర్త ఓటర్ల ఇంటి వద్దకు డిమాండ్‌ చేశారు&period; తమకు నిజంగా ఓటేశారా&period;&period; గుడికి వచ్చి నిరూపించుకోవాలనడంతో ఓటర్లు ఆయనపై మండిపడ్డారు&period; డబ్బులు ఎవరు ఇవ్వమన్నారంటూ తిరగబడ్డారు&period; మేము మీకు ఓటు వేయలేదని ఎలా నిరూపిస్తారంటూ వాగ్వాదానికి దిగారు&period; సదరు అభ్యర్థి భర్త గతంలో ఆ గ్రామానికి సర్పంచిగా పనిచేశారు&period; డబ్బులు అడుగుతున్న వీడియో సోషల్‌ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.

భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.