రాత్రికి రాత్రే బాబుపై లిక్కర్ కేసు పెట్టించిన సైకో..

Atchannaidu

Advertisements

&NewLine;<p>స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి&period; బెయిల్ మంజూరైన వెంటనే మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద మీడియాతో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… చంద్రబాబు మీద వ్యక్తిగత కక్ష పెట్టుకుని&comma; తప్పు లేకపోయినా కేసులు పెట్టారనే విషయం తెలుగు ప్రజలందరికీ తెలిసి పోయిందని అన్నారు&period; అక్రమ కేసులు పెట్టి&comma; జైల్లో ఉంచి లబ్ధి పొందాలని జగన్ చూశారని విమర్శించారు&period; 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు చిన్న తప్పు కూడా చేయలేదని… పార్టీలో ఎవరు తప్పు చేసినా ఆయన సహించరని చెప్పారు&period; మహానుభావుడు చంద్రబాబును ఈ మూర్ఖుడు&comma; ఈ దుర్మార్గుడు జగన్ 52 రోజుల పాటు జైల్లో పెట్టించారని అచ్చెన్న మండిపడ్డారు&period; బెయిల్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తే… రాత్రికి రాత్రే చంద్రబాబుపై లిక్కర్ కేసు పెట్టించిన సైకో అని దుయ్యబట్టారు&period; చంద్రబాబు అరెస్ట్ జగన్ పతనానికి నాంది అని… బాబు జైలు నుంచి బయటకు అడుగు పెట్టిన క్షణం నుంచే వైసీపీ పతనమవుతుందని చెప్పారు&period; వైసీపీని బంగాళాఖాతంలో కలుపుతామని వ్యాఖ్యానించారు&period; హైకోర్టులో ఈరోజు తమకు న్యాయం జరిగిందని అన్నారు&period; ఇప్పటికే లోకేశ్ బాబు రాజమండ్రిలో ఉన్నారని… తాము కూడా ఇప్పుడు రాజమండ్రికి బయల్దేరుతున్నామని చెప్పారు&period; రాబోయే రోజుల్లో ఏం చేయాలనేది అందరం కూర్చొని చర్చించి నిర్ణయిస్తామని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..