రాబోయే 25 ఏళ్లు భారత్‌కు అత్యంత ముఖ్యమైన కాలం

Narendra Modi

Advertisements

&NewLine;<p>రానున్న 25 ఏళ్లు భారత్‌కు అత్యంత ముఖ్యమైన కాలమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు&period; ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్ స్ఫూర్తితో ఈ దేశాన్ని సుసంపన్నదేశంగా మార్చాలని పేర్కొన్నారు&period; మంగళవారం గుజరాత్‌లోని కేవడియాలో పటేల్‌ జయంతిని పురస్కరించుకొని ఐక్యతా విగ్రహం వద్ద నివాళి అర్పించారు&period; ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ&period; విపక్షాలపై విమర్శలు గుప్పించారు&period; బుజ్జగింపు రాజకీయాలు చేసేవారు భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను చూడలేరు&period; ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చేవారికి అండగా నిలబడేందుకూ వెనకాడరు&period; కొంతమంది రాజకీయ నేతలకు సానుకూల అంశాలు కనిపించవు&period; వారు దేశ ఐక్యత కంటే సొంత లక్ష్యాలకే ప్రాధాన్యం ఇస్తారు అని విపక్షపార్టీలపై మోదీ మండిపడ్డారు&period; అలాగే త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు&comma; 2024 సార్వత్రిక ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ&period;&period; అలాంటి నేతలు దేశాన్ని విభజించడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటారని దుయ్యబట్టారు&period; వచ్చే 25 ఏళ్లలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని&comma; అందుకోసం పటేల్‌ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి లక్ష్యాన్ని సాధించాలని సూచించారు&period; ఈ సందర్భంగా ఆర్టికల్‌ 370 రద్దు గురించి ప్రస్తావిస్తూ&period; కశ్మీర్‌&comma; దేశం మధ్య అడ్డుగా ఉన్న ఆర్టికల్‌ 370 గోడ కూలిపోయిందని&comma; ఈ విషయంలో సర్దార్ ఎక్కడున్నా సంతోషిస్తారని అన్నారు&period; పటేల్ జయంతిని పురస్కరించుకొని గుజరాత్‌లో భారీ స్థాయిలో యూనిటీ డే పరేడ్‌ను నిర్వహించారు&period; సీఆర్‌పీఎఫ్ మహిళా సిబ్బంది చేసిన విన్యాసాలను వీక్షించారు&period; ఈ సందర్భంగా వారి ధైర్యసాహసాలను మోదీ అభినందించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్