వరుసగా డకౌట్ అవుతున్న అభిషేక్ శర్మకు గవాస్కర్ సలహా…

Advertisements

<p>టీ20 ప్రపంచకప్ 2026లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ పేలవ ఫామ్ కొనసాగుతోంది&period; నెదర్లాండ్స్‌తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లోనూ డకౌట్ అవ్వడంతో&comma; ఈ టోర్నీలో అతను వరుసగా మూడోసారి సున్నాకే పెవిలియన్ చేరినట్టయింది&period; అంచనాల భారమే 25 ఏళ్ల అభిషేక్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచుతోందని&comma; అతను భారీ షాట్ల కోసం తొందరపడకుండా క్రీజులో సమయం గడపడంపై దృష్టి పెట్టాలని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సూచించాడు&period; వరుస వైఫల్యాలతో&comma; టీ20 ప్రపంచకప్‌à°² చరిత్రలో భారత్ తరఫున అత్యధిక డకౌట్లు నమోదు చేసిన ఆశిష్ నెహ్రా సరసన అభిషేక్ నిలిచాడు&period; స్టార్ స్పోర్ట్స్‌లో గవాస్కర్ మాట్లాడుతూ&comma; అభిషేక్ మంచి ఆటగాడే&comma; కానీ అంచనాలు అతనిపై భారం మోపుతున్నట్లు కనిపిస్తోంది&period; మొదటి బంతికే బౌండరీ లేదా సిక్స్ కొట్టాలని ప్రయత్నించకూడదని&comma; భారీ షాట్లు వాటంతట అవే వస్తాయనీ&comma; బలవంతంగా ఆడకూడదంటూ విశ్లేషించాడు&period;<&sol;p>&NewLine;<p>అమెరికాపై గోల్డెన్ డక్‌తో మొదలైన అభిషేక్ వైఫల్యం&comma; పాకిస్థాన్&comma; నెదర్లాండ్స్ మ్యాచ్‌లలోనూ పునరావృతమైంది&period; ప్రతీసారి ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్ పారేసుకున్నాడు&period; ముందు ఒక పరుగు తీసి ఖాతా తెరవాలి&period; నాలుగైదు బంతులు డాట్ అయినా ఫర్వాలేదు&comma; తర్వాత కవర్ చేయొచ్చు&period; కాస్త క్రీజులో కుదురుకుంటే&comma; అతని సహజమైన ఆట అదే బయటకు వస్తుందని గవాస్కర్ పేర్కొన్నాడు&period; అయితే&comma; అభిషేక్ ఫామ్ గురించి ఆందోళన అవసరం లేదని భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే ధీమా వ్యక్తం చేశాడు&period; అనారోగ్యం కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరమైన అభిషేక్&comma; కోలుకున్న తర్వాత నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడని తెలిపాడు&period; నెట్స్‌లో అతను అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని&&num;8230&semi; త్వరలోనే ఫామ్‌లోకి వస్తాడన్నారు&period;&period; సూపర్ 8 దశ నాటికి అతను కీలకంగా మారతాడని కోచ్ విశ్వాసం వ్యక్తం చేశాడు&period; కీలకమైన సూపర్ 8 దశకు ముందు అభిషేక్ తిరిగి లయ అందుకోవాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

15 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ను శాసించిన వైభవ్.

ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్పై గెలిచిన బెంగళూరు..

గిల్ నిరాశ.. కోహ్లీ పరవశం: ఐపీఎల్ ఫైనల్‌లో ఆర్సీబీ ఘన విజయం..