గత తొమ్మిదేళ్లుగా ప్రశాంతంగా ఉంటున్న తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్న వ్యాఖ్యలకు రాయలసీమ వాసులకు ఎలాంటి సంబంధం లేదని గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ స్పష్టం చేసింది. పంజాగుట్ట లోని అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ సర్వతో ముఖాభివృద్ధి సుస్థిరపాలనకే తమ మద్దతు, మేము సెటిలర్స్ కాదు తెలంగాణీయులమే అంటూ ఫ్ల కార్డులు ప్రదర్శించారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి హనుమంత రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో రాయలసీమ ప్రజలు అన్నదమ్ములుగా కలిసిమెలిసి ప్రశాంతంగా జీవిస్తున్నాం. తెలంగాణ ప్రాంతంలో సీమ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు. ఇటీవల కొందరు సీమాంధ్ర ప్రజల పక్షాన మాట్లాడుతున్నామని చెప్పి చేసే వ్యాఖ్యలు తీవ్ర విచారకరమని అన్నారు. రాయలసీమ వాసులు ఎవరు ఈ తరహా వ్యాఖ్యలను సమర్ధించారని చెప్పారు. విద్వేష వ్యాఖ్యలు చేసే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
114
previous post