శ్రీశైలం – పురాణ గాథ

Srisailam

Advertisements

&NewLine;<p>శిలాదుడనే మహర్షి సంతాన ప్రాప్తికోసం ఘోరమైన తపస్సుచేసి శివుని ప్రసన్నం చేసుకున్నాడు&period; శివుడివరంతో శిలాదుడికి నందీశ్వరుడు&comma; పర్వతుడు అనే ఇద్దరు కుమారులు పుట్టారు&period; వారిలో నందీశ్వరుడు కూడా శివుడి కోసం తపస్సు చేసి కనురెప్పపాటు కూడా వృధాకాకుండా సేవచేసుకునే భాగ్యాన్ని కల్పించాలని&comma; అంతేకాకుండా వాహనంగా ఉండేలా వరం పొందాడు&period; అందులో భాగంగానే శివుడున్న ప్రతిచోట నందీశ్వరుడు దర్శనమిస్తాడు&period; అయితే నందీశ్వరుడు సోదరుడు పర్వతుడు కూడా శివుడికోసం తపస్సుచేసి ఆయనను ప్రసన్నంచేసుకుని&comma; శివపార్వతులతో సహా తన శిరస్సుపై కొలువుండేలా వరంపొందాడు&period; శివుడు కుమారస్వామిని వెతుక్కుంటూ రావడం&comma; పార్వతిమాతకు ఆ ప్రాంత రమణీయత మైమరిపించడం పర్వతుడికి శివుడు వరం ఇవ్వడం లాంటి కారణాలవల్ల శివపార్వతులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్నారు&period; శివుడు వెలసిన పర్వతమే శ్రీపర్వతం&period; తర్వాత అది శ్రీశైలంగా మారింది&period;<br>ఆనాటి శిల్పకళావైభవాన్ని కళ్ళకుకట్టినట్లు చూపించే ఈ ఆలయ ప్రాకారాలన్నీ అలనాటి పురాణ గాథలను&comma; చారిత్రాత్మక విశేషాలను స్ఫురణకుతెచ్చి ఆధ్యాత్మికానందాన్ని పెంచుతాయి&period; గర్భాలయంలో ఉన్న మూలవిరాట్టు మహాలింగం చాలా చిన్నది&period; దీనికి శిరస్సు తాకించి దర్శించుకుంటారు&period; దీనికి ఇతిహాసంలో మరోకథ ప్రచారంలో ఉంది&period; త్రేతాయుగంలో రావణవధానంతరం బ్రహ్మహత్యా దోషం పోగొట్టుకోవడానికి శ్రీరాముడు రామేశ్వరంలో శివలింగ ప్రతిష్టచేసి&comma; మిగిలిన పాపప్రక్షాళనార్థమై నారదుని సలహాపై శివదర్శనానికి బయలుదేరుతాడు&period; అపుడు శివుడు శ్రీపర్వతం మీదున్నాడు&period; ఈ విషయాన్ని నారదుడు రామునికి చెవిలోవేశాడు&period; వెనువెంటనే రాముడు నీ దర్శనానికి వస్తున్నాడని శ్రీపర్వతం మీదున్న స్వామికి ఉప్పందించాడు&period; దాంతో రాముడి కంట పడకూడదనే తలంపుతో శివుడు శ్రీశైల భూగర్భంలో సంచరించాడు&period; అప్పటికే శ్రీశైల శిబిరాన్ని చేరిన శ్రీరాముడు అక్కడినుంచి శివుడ్ని దర్శించాడు&period; అయితే లింగ రూపాన్ని ధరించిన శివుడు భూగర్భంలో కలిసిపోగా&comma; మిగిలిన లింగమే ప్రస్తుతం అశేష భక్తుల సేవలందుకుంటున్న మల్లికార్జున లింగం&period; శివదర్శనార్థం శ్రీరాముడు ఎక్కిన శిఖరమే ప్రస్తుత శిఖరేశ్వరం&period; ఆనాటినుంచి నేటివరకూ శిఖరేశ్వరంనుంచి మల్లికార్జునిని చూసే సాంప్రదాయం కొనసాగుతోంది&period; స్వామివారి ప్రధానాలయంలో సప్తముత్వికలు&comma; మనోహర కుండం&comma; బ్రహ్మకుండం&comma; విష్ణుకుండం&comma; నవబ్రహ్మాలయాలు ఉన్నాయి&period; పంచపాండవులు ప్రతిష్టించిన లింగాలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి&period; సాక్షాత్తు ఆదిగురువు శంకరాచార్యులవారు తపస్సుచేసిన పవిత్ర స్థలం పాలధార&comma; పంచధారలు&period; దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రంలోనే శంకరాచార్యులవారు &OpenCurlyQuote;శివానంద’&comma; &OpenCurlyQuote;సౌందర్యలహరి’లను రచించినట్లు చెబుతారు&period; శ్రీశైల ప్రధానాలయానికి తూర్పున రెండు కిలోమీటర్లు దూరంలో సాక్షిగణపతి ఆలయముంది&period; దట్టమైన అడవిలో ఎత్తయిన కొండలతో&comma; అందమైన లోయలతో గలగలపారే జలధారలతో అలరారుతున్న సుందర ప్రదేశం భీముని కొలను శ్రీమల్లికార్జునస్వామి ఆలయంనుంచి హఠకేశ్వరం చేరుకుని&comma; అక్కడినుంచి కుడివైపున అడవి దారిలో రెండు కిలోమీటర్లు ప్రయాణించి కైలాస ద్వారం చేరుకోవాలి&period; కైలాస ద్వారం నుంచి మెట్లదారిలో దిగితే వచ్చే లోయ ప్రాంతమే భీముని కొలను&period; ఈ మెట్లను రెడ్డిరాజులు శ్రీశైలానికి గల ప్రాచీనమైన నాలుగు కాలిబాట మార్గాలలో భీముని కొలను దారే ఎంతో ప్రసిద్ధి చెందింది&period; &OpenCurlyQuote;అలాగే శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ విద్యతే’ అంటే శిఖర దర్శనం ద్వారా శ్రీశైల నాధుడ్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదట&period; శిఖరేశ్వరానికి కింది భాగంలో వీరశంకరాలయం ఉంది&period; ఒకప్పుడు శ్రీశైల మహాక్షేత్రపు పరిధిలో సుమారు వందకు పైగా మఠాలుండేవని అంచనా&period; ఈ మఠాలన్నీ ప్రధానాలయానికి వాయువ్య దిశలో చోటుచేసుకున్నాయి&period; క్రీ&period;à°¶&period;9-10 దశాబ్దాలనుంచి 15à°µ శతాబ్దంవరకు ఈ మఠాలు ఆలయానికి వచ్చే భక్తులకు సదుపాయాలు కల్పించడం ప్రధానపాత్రను పోషించాయి&period; శ్రీశైల మల్లికార్జున స్వామిని ఒక్కసారి త్రికరణశుద్ధిగా అర్చించినంత మాత్రాన సర్వయజ్ఞాలు చేసిన ఫలాన్ని&comma; సర్వతీర్థాలు సేవించిన ఫలాన్ని అనాయాసంగా పొందవచ్చని సాక్షాత్తు పరమేశ్వరుడు&comma; పార్వతిదేవికి చెప్పినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది&period; ఈ క్షేత్ర దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం&period; హైద్రాబాద్‌నుంచి 200 కిలోమీటర్లు దూరంలో ఉన్న శ్రీశైలంలో భోజన వసతి సదుపాయాలు మెండుగా వున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..