హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీపై హాట్ కామెంట్స్ చేశారు. గత టీడీపీ హాయంలో ఆర్టీసీ బస్సులు వేస్తే, హిందూపురం డిపో నుండి పది బస్సులు చిత్తూరు జిల్లా పుంగనూరుకు తీసుకెళ్లారంటూ మాజీమంత్రి పెద్ధిరెడ్డి రామచంద్రారెడ్డి పై ఘాటైన విమర్శ చేశారు. అభివృద్ధి జరగాలంటే ప్రధానంగా మెరుగైన రవాణా వ్యవస్థ ఉండాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రహదారుల పరిస్థితి అధ్వానంగా మారిపోయిందని బాలకృష్ణ విమర్శించారు. వైసీపీ చేసిన పాపాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను మానసిక క్షోభకు గురి చేశారని అన్నారు. అమాయకులను హత్యలు చేయించారని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు వైసిపిపై ఆగ్రహించి కూటమిని గెలిపించారన్నారు. ఏపీలో అభివృద్దే లక్ష్యంగా కూటమి పని చేస్తుందని ఎమ్మెల్యే బాలకృష్ణ హామీ ఇచ్చారు. హిందూపురం టీడీపీ కార్యాలయంలో 64 కేజీల కేక్ కట్ చేసి ఎమ్మెల్యే బాలకృష్ణకు టీడీపీ శ్రేణులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.