112
రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలోని 134 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. నంద్యాలలో 41 పరీక్ష కేంద్రాలు లో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 30,242 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్ష రాస్తున్నట్లు తెలిపారు. హాల్ టికెట్లు క్షుణ్ణంగా పరిశీలించిన మీదటనే లోపలికి విద్యార్థులు పంపినట్లు అధికారులు తెలిపారు. డిఎస్పి రవీంద్ర నాథ్ రెడ్డి మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేసామని, పరీక్ష కేంద్రాలలో ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను, సెల్ ఫోన్లు లాంటి వస్తువులను అనుమతించేది లేదని స్పష్టం చేశారు.