22వ ట్రస్ట్ బోర్డ్ సమావేశం…

22nd Trust Board Meeting

Advertisements

&NewLine;<p>నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానం పరిపాలన భవనంలో ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో 22వ ట్రస్ట్ బోర్డ్ సమావేశం జరిగింది&period; ఈ సమావేశం సుమారు 4 గంటలపాటు కొనసాగింది&period; అనంతరం ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మొత్తం 59 ప్రతిపాదనలను ప్రవేశపెట్టగా 57 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి 2 వాయిదా వేశామన్నారు&period; శ్రీ స్వామి అమ్మవారి ప్రాతఃకాల సేవలో పాల్గొనే భక్తులకు వెండి శివపార్వతుల ప్రతిమను ఇవ్వాలని నిర్ణయించారు&period; అలానే క్షేత్ర పరిధిలోకి పులులు రాకుండా శివరాత్రి లోపు ఫెన్సింగ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు&period; క్షేత్ర పరిధిలో ప్రసార వ్యవస్థకు ఎల్ఈడి విద్యుత్ కు 20 లక్షలు కేటాయించామన్నారు&period; భక్తుల సౌకర్యార్థం స్థానిక బ్యాంకుల ద్వారా మరో మూడు ఏటీఎంల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు&period; భక్తుల సందర్శనకు ఏనుగుల చెరువు వద్ద మల్లమ్మ కన్నీరు వద్ద సుమారు 20 ఎకరాల్లో నందనవనం ఏర్పాటు చేయాలని తీర్మానించారు&period; అలానే పక్షులకు వన్యమృగ పార్కు ఏర్పాటు చేస్తామని&comma; విద్యుత్ ఉత్పత్తికి హైడ్రాలిక్ మిషన్ కి 40 లక్షలకు కూడా ఆమోదం తెలియజేసారు&period; ముఖ్యంగా రాబోవు శివరాత్రి&comma; రోజువారి అవసరాల కోసం సీసీటీవీ నిర్వహణకు 34 లక్షల ఆమోదించారు&period; నంది సర్కిల్ వద్ద రహదారి విస్తరణ&comma; రుద్రపార్క్ వద్ద చైన్ లింక్ మిషన్ ఏర్పాటు చేస్తామన్నారు&period; భక్తుల నిత్యాన్నదాన భవనంలో వివిధ మరమ్మత్తులకు 15 లక్షలు ఆమోదించి ఇటీవల అటవీశాఖ నుండి దేవస్థానం భూముల బదలాయింపులో అటవీశాఖ కొన్ని కండిషన్స్ పెట్టగా వాటిని పునఃపరిశీలించాలని లిఖితపూర్వకంగా అటవీశాఖ అధికారులకు తెలుపుతామన్నారు&period; అలానే దేవస్థానంలో పని చేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సైతం కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చే వేతనం ఇవ్వాలని ట్రస్ట్ బోర్డ్ లో ఆమోదం తెలిపి కమిషనర్ కు పంపుతామని చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..