69
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పమేన భి భరత్ షాబాద్ చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ వరకు కార్యకర్తలతో భారీ ర్యాలీగా వచ్చి తన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని తెలంగాణ ప్రజలు ఏం అవసరం ఉన్న కాంగ్రెస్ పార్టీ తీరుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అలాగే చేవెళ్లలో నాకు ఎలాంటి పోటీ లేదని చేవెళ్ల లో 60 వేల మెజార్టీతో గెలుపొందుతానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు..