నెల్లూరు జిల్లాలో అతిపెద్ద భూ యజమానిగా ఇండోసోల్ కంపెనీ నిలిచిందని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వైసీపీ నాయకులు 8,348 ఎకరాల భూమిని ఇండోసోల్ కంపెనీకి అన్న సంతర్పణగా చేశారని చేసిన ఆరోపణలను ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఖండించారు. పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌వి అసత్య ఆరోపణలు అని అభివర్ణించారు. పరిశ్రమలశాఖలో అభివృద్ధిని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాదెండ్ల మనోహర్ ముందు పరిశ్రమల శాఖపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మరోవైపు నాదెండ్ల మనోహర్‌కు వెన్నుపోటు వారసత్వంగా వచ్చింది. అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు. నాదెండ్ల భాస్కర్ రావు అన్న నందమూరి తారక రామారావుకు వెన్నుపోటు పొడిస్తే పవన్ కల్యాణ్‌కు నాదెండ్ల మనోహర్ వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు. నాదెండ్ల మనోహర్‌కు అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం అలవాటుగా మారిందని అన్ని అంశాలపై అవగాహన తెచ్చుకుని మాట్లాడితే బాగుంటుందని లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ హెచ్చరించారు.
Read Also..
Read Also..