79
హైదరాబాద్ శివారులో భారీగా నగదు పట్టుబడింది. తనిఖీల్లో రూ.6.5 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బండ్లగూడ అప్పా జంక్షన్ దగ్గర ఈ డబ్బును పట్టుకున్నామని తెలిపారు. లెక్కలు చూపని డబ్బును ఆరు కార్లలో తరలిస్తున్నారని అధికారులు చెప్పారు. ఈ డబ్బును ఎన్నికల కోసం తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన నేతకు సంబంధించిన నగదుగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.