81
వైసీపీ పాలనలో మోసపూరిత హామీలు, కక్ష పూరిత రాజకీయాలే తప్ప అభివృద్ధి లేదని టీడీపీ-జనసేన నాయకులు ఫైర్ అయ్యారు. నియోజవర్గంలో శిథిలావస్థకు చేరిన రహదారులను అభివృద్ధి చేయాలంటూ పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. టీడీపీ ఇన్చార్జ్ పొత్తూరి రామరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో రూ3వేల 200 కోట్ల పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేసి ఏడాది గడిచినా నేటికీ పనులకు నోచుకోలేదన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ- జనసేనలకు ప్రజలు అండగా నిలవాలన్నారు. జనసేన కన్వీనర్ నాయకర్ మాట్లాడుతూ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు సాధ్యం కానీ హామీలతో ప్రజల్ని దగా చేస్తున్నారని మండిపడ్డారు.