బుధవారం ఉదయం ఉలవపాడు ఎన్ జె డి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, సబ్ కలెక్టర్ శోభిక, జడ్పీ సీఈవో చిరంజీవి జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుండి అందిన అర్జీలను నిర్ణీతకాలవ్యవధిలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మే 9 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించిందని, అందులో భాగంగానే గ్రామస్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో మండల కేంద్రాల్లో ముందుగానే షెడ్యూలు ప్రకటించి ప్రతి బుధవారం, శుక్రవారం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రానికి రాలేని గ్రామా ప్రజల సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించడం, సంతృప్తికర స్థాయిలో పరిష్కరించేందుకు మండల కేంద్రాల్లో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉలవపాడు లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. రెవెన్యూ , సర్వే,వారసత్వం భూముల మ్యూటేషన్లు, ఇళ్ల స్థలాలు, రోడ్లు,మౌలిక వసతుల కల్పన మొదలైన సమస్యలపై 80 అర్జీలను ప్రజలు అందజేశారని, నిర్ణీత గడువులోగా ఈ అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు.
ఈ కార్యక్రమంలో నుడావిసి బాపిరెడ్డి, సిపిఓ సాలెం రాజు, హౌసింగ్, డ్వామా పీడీలు నాగరాజు, వెంకట్రావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎంవి సుబ్బారెడ్డి, మైనార్టీ వెల్ఫేర్ అధికారి నిర్మలాదేవి, సమగ్ర శిక్ష ఏపీసి ఉషారాణి, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పలువురు జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Read Also…
Read Also…