ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దనసరి (అనసూయ) సీతక్క భారీ మెజారిటీతో విజయం సాధించారు. 14 టెబుల్ లలో మొదటి రౌండు నుండి 22వ రౌండ్ వరకు కొనసాగిన ఓట్ల లెక్కింపులో సీతక్క ఆదిత్యం కనబరిచింది. బి ఆర్ యస్ అభ్యర్ధి బడే నాగజ్యోతి కి 68,567 ఓట్లు రాగా కాంగ్రేస్ పార్టి అభ్యుర్ధి సీతక్క కు 102267 ఓట్లు లబించాయి. బిఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి పై కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క 33 వేల 700 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. మీడియాతో సీతక్క మాట్లాడుతూ నా విజయానికి సహకరించిన కార్యకర్తలకు, ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సీతక్కను ఓడించడానికి కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి బడా నేతలు ఎందరో ములుగులో పాగా వేసి కోట్ల రూపాయల దనాన్ని కుమ్మరించి ప్రజలను ప్రలోభాలకు గురిచేసిన ప్రజలు నా పక్షాన ఉండి నన్ను గెలిపించారని వారికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించారని అన్నారు.
భారీ మెజారిటీతో విజయం సాధించిన సీతక్క….
67
previous post