తడిసిన ధాన్యాన్ని రంగు మారిందాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ ఎంపీ మాగంటి బాబు డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా మండవల్లి మండలం పెర్కెగూడెం గ్రామంలో మిచాంగ్ తుఫాను కారణంగా వరి పంటను గురువారం టిడిపి నాయకులతో కలిసి పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా రైతాంగం తుఫాను కారణంగా ఎంతో నష్టపోయారని కానీ ప్రభుత్వం ఇప్పటివరకు నష్ట నివారణ చర్యలు చేపట్టకపోవడం దారుణం అన్నారు. ఇప్పటికే వరి రైతుల 40000 పొగాకు రైతులు 1లక్ష, పెట్టుబడులు పెట్టారని కనీసం 10000 దిగుబడి వచ్చే అవకాశం లేదని వివరించారు. పంట పొట్ట దశలో ఉన్నప్పుడు కనీసం నీటినందించక పోవడంతో కొంతమేర దెబ్బతిన్న, తుఫానుతో పూర్తిగా పంట రైతులు నష్టపోయారని వాపోయారు. టిడిపి నిర్మించిన పట్టిసీమ ద్వారా నీటిని తోడుకొని కృష్ణ డెల్టా రైతులకు అందించవలసి ఉన్న అటువైపు దృష్టి సారించలేదని ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా నాగార్జునసాగర్ పై రెండు ప్రభుత్వాలు కలిసి నీళ్ల కోసం తోలుబొమ్మలాడారని ఎద్దేవా చేశారు. రైతులను వెంటనే ఆదుకోవాలని లేకపోతే టిడిపి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
Read Also..