రాష్ట్రంలో ఖరీఫ్ లో పండిన ధాన్యాన్ని వచ్చే ఏడాది మార్చి నెల వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులు ఈ విషయంలో ఎటువంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమీషనర్ హెచ్. అరుణ్ కుమార్ చెప్పారు. ఏలూరు జిల్లా పెదపాడు మండలం కొక్కిరపాడు, వట్లూరు, రైతు భరోసా కేంద్రాలలో ధాన్యం కొనుగోలును, సీతారాంపురంలో దెబ్బతిన్న పంట పొలాలను, అధికారులతో కలిసి పరిశీలించి అక్కడ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ తూఫాన్ కారణంగా రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూడడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం లక్ష్యంగా నిర్ణయించామని, అయినప్పటికీ ఎంత మేర ధాన్యం వచ్చినా సేకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గత రెండు రోజుల నుండి రాష్ట్రవ్యాప్తంగా 1.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేశామన్నారు. కోత కోసిన ధాన్యాన్ని రైతుల కల్లాల నుండి నేరుగా ఆఫ్ లైన్ విధానంలో రైస్ మిల్లులకు తరలిస్తున్నామన్నారు. తేమశాతం పై రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం తీసుకోవాలని రైస్ మిల్లర్లు కోరడం జరిగిందన్నారు. కోత కోయవలసిన పంట లో మొలకలు వచ్చిన ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవలసి ఉందని, ఇందుకోసం ఫుడ్ కొర్పొరేషన్ ఆఫ్ ఇండియా వారితో టెస్ట్ మిల్లింగ్ చేసి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. రంగుమారిన ధాన్యం, నూకశాతం పై రైతుకి, మిల్లర్లకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
crop
తడిసిన ధాన్యాన్ని రంగు మారిందాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ ఎంపీ మాగంటి బాబు డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా మండవల్లి మండలం పెర్కెగూడెం గ్రామంలో మిచాంగ్ తుఫాను కారణంగా వరి పంటను గురువారం టిడిపి నాయకులతో కలిసి పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా రైతాంగం తుఫాను కారణంగా ఎంతో నష్టపోయారని కానీ ప్రభుత్వం ఇప్పటివరకు నష్ట నివారణ చర్యలు చేపట్టకపోవడం దారుణం అన్నారు. ఇప్పటికే వరి రైతుల 40000 పొగాకు రైతులు 1లక్ష, పెట్టుబడులు పెట్టారని కనీసం 10000 దిగుబడి వచ్చే అవకాశం లేదని వివరించారు. పంట పొట్ట దశలో ఉన్నప్పుడు కనీసం నీటినందించక పోవడంతో కొంతమేర దెబ్బతిన్న, తుఫానుతో పూర్తిగా పంట రైతులు నష్టపోయారని వాపోయారు. టిడిపి నిర్మించిన పట్టిసీమ ద్వారా నీటిని తోడుకొని కృష్ణ డెల్టా రైతులకు అందించవలసి ఉన్న అటువైపు దృష్టి సారించలేదని ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా నాగార్జునసాగర్ పై రెండు ప్రభుత్వాలు కలిసి నీళ్ల కోసం తోలుబొమ్మలాడారని ఎద్దేవా చేశారు. రైతులను వెంటనే ఆదుకోవాలని లేకపోతే టిడిపి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
Read Also..
చిత్తూరు జిల్లా పలమనేరు, గంగవరం మండలం. కళ్ళు పల్లి గ్రామం రైతు సతీష్ మాట్లాడుతూ అకాల వర్షం వల్ల టమాటో పంట నష్టపోయామంటూ వాపోతున్నాడు. టమాటో ఒక ఎకరానికి 3.5ర లక్షలు ఖర్చు వచ్చింది నేను 4 గు ఎకరాల టమాటా వేశాను 12డు లక్షలు ఖర్చు వచ్చింది. వరి పంట కూడా నష్టపోయాము కన్నీరు మున్నీరు కారుస్తున్న రైతు. బాధలను తీర్చాల్సింది ప్రభుత్వమే అని విన్నవించుకుంటున్న రైతు సతీష్
పల్నాడు జిల్లా పెదకూరపాడు,అచ్చంపేట, క్రోసూరులలో పంటపొలాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, పలువురు రైతు నాయకులు పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల్లో తీవ్రవర్షాభావ పరిస్థితులున్నాయి .. 122 యేళ్ళ క్రితం ఇదేవిధంగా వర్షాభావం ఏర్పడింది పొలాల్లో పంటలు దెబ్బతిన్నాయి,దాంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది.. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించి , రైతాంగానికి వెంటనే సాగునీరు అందించి, తొమ్మిది గంటలు వ్యవసాయ విద్యుత్ సరఫరా చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు .