81
తెలంగాణలో విద్యుత్ పరిస్థితి గందరగోళంగా ఉందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కేబినెట్ తొలి సమావేశంలో విద్యుత్ పరిస్థితిపై విస్తృతంగా చర్చించారు. సీఎండీపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా అనీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సారి జరగనున్న సమీక్షకు సీఎండీలను కూడా పిలవాలని ఆదేశించారు. సీఎండీ రాజీనామాను ఆమోదించవద్దన్నారు. ఆరు గ్యారెంటీలపై కర్ణాటకకు వెళ్లి అధ్యయనం చేయాలని సూచించారు. ప్రజల ఆకాంక్షల మేరకు అధికారుల పని తీరు ఉండాలని అన్నారు. అధికారులు సమర్థవంతంగా పని చేయాలనీ, లేకుంటే ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయని అధికారులను హెచ్చరించారు.