భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పాల్వంచ ప్రభుత్వ వైద్యశాలలో ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షల రూపాయలు వరకు వర్తించే ఈ పథకాన్ని నేడు లాంఛనంగా ప్రారంభించారు. పాల్వంచ ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీ పథకం ఐదు లక్షల నుండి పది లక్షల రూపాయల వరకు పెంచుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు పథకాలలో ఒక పథకమైన ఆరోగ్య శ్రీ పథకం ఐదు లక్షల నుండి పది లక్షల రూపాయలకు పెంచిన నేపథ్యంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పేదల కోసం ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేడు ఆ పథకం 10 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగిందని పాల్వంచ ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ల కొరత, డయాలసిస్ సెంటర్, ఈ వైద్యశాలను వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు తప్పకుండా తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ శిరీష, వైద్యులు పాల్గొన్నారు.
మరో పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే….
64
previous post