101
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవికి వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ వేశారు. స్పీకర్ నామినేషన్ కార్యక్రమానికి సిఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు, విపక్ష సభ్యలు హాజరయ్యారు. ప్రసాద్ కుమార్ పేరును ప్రతిపాదిస్తూ ఎమ్మెల్యే కేటీఆర్ నామినేషన్‌పై సంతకం చేశారు. నామినేషన్ కాపీని అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు మంత్రులు, కేటీఆర్, కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. రేపు ఉదయం స్పీకర్ ఎన్నిక జరగనుంది.
Read Also..
Read Also..