జడ్చర్ల నియోజకవర్గంలో ఇసుక మాఫీయా చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారిగా అనిరుధ్ రెడ్డి జడ్చర్లలో పర్యటించారు. ఎక్కడా కూడా ఇసుక మాఫియాకు తావు లేదని, ఇప్పటికే నవాబుపేట మండలంలో 13 ఇసుక డంపులను సీజ్ చేయడం జరిగిందన్నారు. ఒకవేళ ఎవరైనా ఇసుక మాఫియాకు సొంతపార్టీ వారే సహకరిస్తే వారిని కూడా వదిలిపెట్టేది లేదని ఆయన తేల్చి చెప్పారు. జడ్చర్ల నియోజకవర్గంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. జడ్చర్ల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఆర్ అండ్ బి సహకారంతో త్వరలోనే 100 కోట్ల నిధులతో రోడ్లు వేయిస్తామని తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, వారికి ఏ సమస్య వచ్చినా డైరెక్ట్ గా తనకు తెలియజేయవచ్చన్నారు. పట్టణంలో నూతన గృహ నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్న వారు ఒక కాపీ నాకు ఇస్తే, 15 రోజులలో ఇంటి పర్మిషన్ ఇస్తామన్నారు. ఏ అధికారి అయినా సరే లంచాలు అడిగితే నేరుగా తనకు గాని తన కింది వారికి గాని ఫిర్యాదు చేయవచ్చని అనిరుధ్ ప్రజలకు సూచించారు.
ఇంకా సహించేది లేదు….
83
previous post