81
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సచివాలయంలో ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలు శాఖలకు
భట్టి విక్రమార్క నిధులు మంజూరు చేశారు. వాటికి సంబంధించిన దస్త్రాలపై భట్టి సంతకాలు చేశారు. ఆర్టీసీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన సబ్సిడీ కింద 374 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి 298కోట్లు, విద్యుత్ సబ్సిడీకి 996 కోట్లు, మేడారం జాతర ఏర్పాట్లకు 75 కోట్ల నిధులను విడుదల చేస్తూ సంబంధిత ఫైల్స్ పై భట్టి విక్రమార్క సంతకాలు చేశారు.