కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా, అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోయాయని, చివరకు పోలీస్ అధికారుల మీద, ఫారెస్ట్ అధికారుల మీద ఇసుక మాఫియా దాడులు చేసే స్థితికి పెరిగిపోయిందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరద రాజుల రెడ్డి ఆరోపించారు. నంగనూరు పల్లె ఫారెస్ట్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకునేందుకు ప్రయత్నించిన సిబ్బందిపై ఇసుక మాఫియా ట్రాక్టర్ తో వాహనాన్ని ఢీ కొట్టించి గాయపరిచే చర్యలకు పాల్పడ్డారని, ఇది దారుణమని మాజీ ఎమ్మెల్యే వరద అన్నారు. 50 మంది ప్రజా ప్రతినిధులను తన వెంట తీసుకువెళ్లి ప్రొద్దుటూరులో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు లేకుండా చూడాలని ఎమ్మెల్యే చేసిన విజ్ఞప్తులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీ నేతల అండదండలతోనే ఇసుక మాఫియా పేట్రేగిపోతోందని విమర్శించారు. జిల్లా ఎస్పీ ఎందుకు ఈ అసాంఘిక, అక్రమ కార్యకలాపాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. నియోజకవర్గంలో అక్రమ వ్యవహారాలను అరికట్టకపోతే ప్రజలు తీవ్రంగా నష్టపోతారని, అధికారులు అభద్రతతో పని చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీకి మాజీ ఎమ్మెల్యే వరద రాజుల రెడ్డి విజ్ఞప్తి చేశారు.
అధికారులను కూడా వదలని ఇసుక మాఫియా….
81
previous post