74
డా.బి.ఆర్.అంభేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరంలో తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం విద్యాశాఖ సమగ్ర శిక్షా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా నిరసన తెలిపారు. ముమ్మిడివరంలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కోనసీమ జిల్లా ఉద్యోగులు సైతం ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నిరసనకు యి.టి.ఎఫ్, ఎస్.టి.యి ఉపాధ్యాయ సంఘాలు సంఘీభావం తెలిపాయి.