అంగన్వాడీ టీచర్ల, ఆయాల సమస్యలు పరిష్కరించాలని గత 13 రోజులుగా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం ఎదురుగా చేస్తున్న నిరసన సమ్మె సోమవారం 14వ రోజుకు చేరింది. సోమవారం క్రిస్మస్ పండుగ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు యేసుప్రభు చిత్రపటానికి వినతి పత్రం అందజేశారు. ఏపీ సీఎం జగన్ మనసు మార్చి మా జీతాలు పెంచేలా చూడాలని యేసుప్రభుకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు, అంగన్వాడి టీచర్లు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీసం రూ.26,000 గౌరవ వేతనం ఇవ్వాలని, ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గత 13 రోజులుగా అంగన్వాడి టీచర్లు నిరసన సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదని వారు ఈ సందర్భంగా జగన్ సర్కార్ పై మండిపడ్డారు. తక్షణమే అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో రాబోవు కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.
యేసుక్రీస్తు కు వినతి పత్రం అందజేసిన అంగన్వాడీ టీచర్లు..
75
previous post