సింగరేణి ఎన్నికలు కొనసాగుతున్నాయి. సింగరేణిలో మొదటిసారిగా 1998 సంవత్సరంలో కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరుసార్లు ఎన్నికలు జరగగా అందులో ఏఐటీయూసీ మూడు సార్లు, ఐఎన్టీయూసీ ఒకసారి, టీబీజీకేఎస్ రెండు సార్లు గెలిచి అధికార హోదాను అనుభవించాయి. ఏడో దఫా జరిగే 2023 ఎన్నికల్లో 14 సంఘాలు పోటీ చేయాల్సి ఉన్నా 13 సంఘాలు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశాయి. ఏడో దఫా ఎన్నికలు, ఇందు కోసం సింగరేణి అధికార యంత్రాంగం, కార్మిక శాఖ సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ లోని 6 జిల్లాల పరిధిలో ఉన్న 11 డివిజన్ లలో, 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా,12 ఓట్ల లెక్కింపు కేంద్రాలను,440 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించెందుకు సింగరేణి యాజమాన్యం పూర్తిగా ఏర్పాట్లు చేసింది. సింగరేణి విస్తరించి ఉన్న 11 ఏరియాలలో సింగరేణి సంస్థలో 50,500 కార్మికులు ఉన్నా 39,748 మంది కార్మిక ఓటర్లు తమ ఓటును వినియోగించుకోనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు లలోని 16 పోలింగ్ కేంద్రాలలో 5387 మంది సింగరేణి కార్మిక ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో నాలుగు ఏరియాల్లో మొత్తం 16 పోలింగ్ కేంద్రాలను ఏరియా కి ఒకటి చొప్పున నాలుగు లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఖమ్మం జిల్లాలోని జేవీఆర్, కిష్టారం ఓసీలలో మొత్తం మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా భద్రాద్రి కొత్తగూడెం ఏరియాలో 13 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కొత్తగూడెం ఏరియాలో 6,ఇల్లెందు ఏరియాలో 3, మణుగూరు ఏరియాలో 7 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాత్రి ఏడు గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపుకు 200 మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. సింగరేణి ఎన్నికలను బ్యాలెట్ పద్దతిన నిర్వహించేందుకు కార్మిక శాఖ సంసిద్దమవుతోంది. అయితే ఎన్నికల నిర్వహణ, ఫలితాల వెల్లడి ఒకే రోజు కావడంతో ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.
సింగరేణిలో కొనసాగుతున్న ఎన్నికలు
61
previous post