అనకాపల్లి జిల్లాలో అప్పుల బాధ తాళలేక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అనకాపల్లిలో చోటుచేసుకుంది. రాత్రి ఓ అపార్ట్మెంట్లో పురుగుల మందు తాగి భర్త, భార్యతో సహా ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మరో 9 ఏళ్ల పాప కుసుమ ప్రియ ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. చికిత్స పొందుతున్న కుసుమ ప్రియా పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే కొడవలి రామకృష్ణ తన భార్య మాధవి దేవి వారి పిల్లలు వేద వైష్ణవి, జాన్వి లక్ష్మి, కుసుమ ప్రియ తో కలిసి గత కొంతకాలంగా స్థానిక ఫుడ్ పేట, ఫైర్ స్టేషన్ పక్కన లక్ష్మీ పారడైస్ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నట్లుగా అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పట్టణ సీఐ దాడి మోహన్ రావు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. గుంటూరు తెనాలికి చెందిన రామకృష్ణ కుటుంబం రాత్రి అన్నంలో పురుగులు మందు కలుపుకొని మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని మంగళగిరిలో ఉంటున్న రామకృష్ణ బంధువులకి సీఐ సమాచారం చేరవేశారు. మృతులు భర్త కొడవలి రామకృష్ణ, భార్య మాధవి దేవి, పిల్లలు వేద వైష్ణవి, జాన్వి లక్ష్మిగా పోలీసులు గుర్తించారు.
అనకాపల్లి జిల్లాలో విషాదం..
69
previous post