Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Health బేకింగ్ సోడాలో అనేక ఉపయోగాలు

బేకింగ్ సోడాలో అనేక ఉపయోగాలు

by Satya
Baking soda

కొంచెం బేకింగ్ సోడాను పేస్టులాగా చేసి దానిని వంటగదిలో గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల జిడ్డుగా ఉన్న చోట రాసి ముందు తడిబట్టతో ఆపై పొడిబట్టతో తుడిస్తే శుభ్రపడుతుంది. ఒక లీటర్ నీళ్ళలో కొంచెం బేకింగ్ సోడా వేసి ఆ నీటితో ఫ్లాస్క్ ను శుభ్రం చేస్తే దానిలోని వాసనలన్నీ మాయమవుతాయి. పొట్టలో మంట లేక అనిజీగా ఉన్నప్పుడు కప్పు నీళ్ళలో పావు చెంచా బేకింగ్ సోడా వేసుకుని తాగితే వెంటనే ఫలితం కనిపిస్తుంది. మాంసం వండటానికి ముందు దానికి బేకింగ్ సోడా పట్టించి రెండు లేక మూడు గంటలు ఫ్రిజ్ లో ఉంచి తీయండి. తరువాత దానిని శుభ్రంగా కడిగి వండితే మృదువైన, రుచికరమైన మాంసం తయారు. చెమటతో శరీరం దుర్వాసన వస్తుంటే చెమట పట్టే ప్రదేశాల్లో కొంచెం బేకింగ్ సోడాను చెల్లితే శరీర దుర్వాసన మాయం. టొమాటో వంటి పుల్లటి సూప్ కు మంచి రుచి రావాలంటే చిటికెడు బేకింగ్ సోడా కలిపితే సరి. కొంచెం వేడి నీళ్ళలో ఒక చెంచా బేకింగ్ సోడా వేసి దానిలో మురికిగా ఉన్న దువ్వెన, బ్రష్ లు వేసి, కొంచెంసేపు తర్వాత మంచి నీళ్ళతో కడిగితే మురికి పోతుంది. తడిపిన స్పాంజ్ మీద కొంచెం బేకింగ్ సోడా చల్లి దాంతో ఫ్రిజ్ ను తుడిస్తే శుభ్రంగా ఉంటుంది. ఒక చిన్నబాక్స్ లో కొంచెం బేకింగ్ సోడాను ఉంచి దాన్ని ఫ్రిజ్ లో ఉంచితే దుర్వాసనలన్ని పోయి చక్కగా ఉంటుంది.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

026020
Total views : 149719

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.