కాకినాడ రూరల్ కాపు కళ్యాణమండపం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో ఆమె మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కి సహకారం అందించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం అపవాద వేయడం సరికాదని బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. కేంద్రం భాగ్యస్వామ్యం లేకుండా రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగడం లేదని అన్నారు. కార్యకర్తల ను కలవాలని జిల్లాలలో పర్యటనలు చేస్తున్నామని, జిల్లాలలో రాజకీయ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతలను నిర్వర్తించడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ లో ప్రకటించిన జాబితాలో కాకినాడ ఉందని స్మార్ట్ సిటీ నిధులు డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. కాకినాడ లో పెట్రో కెమికల్ కారిడర్ పెడతామని కేంద్రం ముందుకు వస్తే రాష్ట్రం ముందుకు రాలేదని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని అని, రాష్ట్రంలో విధ్వంసపాలన సాగుతుందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Read Also..