Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Andhra Pradesh సామాజిక సాధికార బస్సు యాత్ర సమావేశం

సామాజిక సాధికార బస్సు యాత్ర సమావేశం

by Satya
Social empowerment bus trip meeting

రాష్ట్రంలో పేద వర్గాలకు జరిగిన లబ్ది వివరించేందుకు సామాజిక సాధికార బస్సు యాత్ర చేపడుతున్నామని ఎమ్మెల్యే పార్థసారధి తెలిపారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో మొత్తంగా 1.10 లక్షల మందికి 12 వేల 99 కోట్ల రూపాయలు లబ్ది చేకూరిందని ఎమ్మెల్యే తెలిపారు. పేద వాళ్లకు 29 వేల పైచిలుకు ఇళ్ల స్థలాలు ఇచ్చామని కాలువ గట్లలో నివసించేవారికి 75 శాతం సిమెంట్ రోడ్లు, నీటి కుళాయిలు సౌకర్యాలు కల్పించామన్నారు. పెనమలూరు నియోజకవర్గ వ్యాప్తంగా 30 వేల జనాభా ఉన్న మైనార్టీల కోసం 3 షాధికాణాలు నిర్మించామని తెలిపారు. మార్కెట్ యార్డులు, PACS, CSC చైర్మన్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఇచ్చామన్నారు.
బందరు కాలువలో పూడికతీత మా ప్రభుత్వం హయాంలోనే పూర్తి చేసామని పార్థసారధి తెలిపారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

036126
Total views : 180911

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.