ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులకు ఏజెన్సీ నుంచి సకాలంలో జీతాలు రాక ఇబ్బంది పడుతుండడంతో కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యే తన దైన శైలిలో స్పందిచారు. జీతాలు పెంచాలన్న తమ డిమాండ్ల సాధనకోసం ఆందోళనలో కూర్చున్న కార్మికులకు తన సొంత నిధులతో ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఎమ్మెల్యే మాట విని తిరిగి విధుల్లోకి వచ్చిన కార్మికులకు, నష్టపోయిన నాలుగురోజుల పనిదినాల వేతనాన్ని ఎమ్మెల్యే చెల్లించేందుకు సిద్ధమయ్యారు. అలాగే ప్రభుత్వం కార్మికులకు వేతనాలు పెంచేంతవరకు ప్రతినెల మూడు వేల రూపాయలు అదనంగా తన సొంత నిధుల నుంచి చెల్లిస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రభుత్వం కార్మికులకు వేతనం పెంచేంతవరకు తన సహాయం అందిస్తానని, వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి తన ఆర్థిక సహాయం మూడు వేల రూపాయలను అందిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గతంలో కూడా గోపవరం పంచాయతీ శానిటరీ వర్కర్లు, ప్రొద్దుటూరు మున్సిపాల్ కార్మికులు, జిల్లా ఆస్పత్రిలోని కార్మికులకు ఇదే తరహాలో ఆర్థిక సాయం అందించిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. కార్మికుల సమస్య పట్ల న్యాయమైన డిమాండ్ పట్ల తాను సానుకూలంగా ఉన్నానని.. అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని పెంచడానికి కొంత సమయం పడుతుందన్నారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తల విషయంలో కూడా వారి డిమాండ్ల పరిష్కారం కావాలని జీతాలు పెరిగి వారు కూడా మిగిలిన వారిలాగే ఉన్నతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రొద్దుటూరు మున్సిపాల్టీలో పనిచేసే 43 మంది అవుట్ సోర్సింగ్ పబ్లిక్ హెల్త్ వర్కర్లకు నాలుగు రోజుల దిన వేతనం మూడు వేలు, అలాగే 39 మంది క్లాప్ డ్రైవర్లకు నాలుగు నెలల వేతనం, ఆందోళన కారణంగా నష్టపోయిన దిన వేతనాన్ని అందిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. సుమారు 18 లక్షల రూపాయల నిధులను ఎమ్మెల్యే ఈ సందర్భంగా వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మిదేవి, కమీషనర్ వెంకట రమణ, కౌన్సిలర్లు వరికూటి ఓబుళ రెడ్డి, జిలానీ, కమాల్, నాగరాజు, వైసిపి రాష్ట్ర నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్న శివప్రసాద్ రెడ్డి..
60
previous post